*తెలుగు బాషా దినోత్సవం*

- August 29, 2016 , by Maagulf
*తెలుగు బాషా దినోత్సవం*

పాలమీగడ కన్న - పాయసంబు కన్న 

తియ్యనయినది మన తెలుగు భాష
పంచదార కన్న - పనసతొనల కన్న
తియ్యనయినది మన తెలుగు భాష
ఝుంటె తేనె కన్న - జున్ను ముక్క కన్న
తియ్యనయినది మన తెలుగు భాష 
తియ్య మామిడి కన్న - తీపిలన్నిటి కన్న
*తియ్యనయినది మన తెలుగు భాష*
తెలుగు భాష ఎంత మధురమయినదో కవిగారు ఎంతబాగా చెప్పారో కదా! మరి అలాంటి తెలుగు భాష ప్రమాదంలో పడింది. ఐక్య రాజ్య సమితి వారి ఒక నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 6500/- భాషలుంటే అందులో సగానికి దగ్గరగా సుమారుగా 3000/- భాషలు అంతరించిపోయాయంట. అయితే బాధాకరమైన మరో విషయం ఏమిటంటే, రాబోయే కాలంలో అంతరించపోబోయే మరికొన్ని భాషలలో తెలుగు భాష కూడా ఉన్నట్లు ప్రకటించడం. తెలుగు భాషాభివృద్ధికి మనందరం కలిసి కృషి చెయ్యవలసిన సమయం ఆసన్నమైంది. ఇందుకు మనం పండితులం కానక్కరలేదు. బాషా ప్రావీణ్యం అక్కరలేదు. భాషాభిమానం ఉంటే చాలు. అవసరం లేని చోట పరభాషలో మాట్లాడకుండా చక్కటి మన తెలుగు వ్యావహారిక భాషలో మాట్లాడుకుంటే అదే 'పదివేలు -భాషకు మేలు'. మన పిల్లలకు, తద్వారా భావి తరాలకు తెలుగు మాధుర్యాన్ని తెలియ చేద్దాం. ఆపదలోవున్న భాషను రక్షించుకుందాం, బ్రతికించుకుందాం. తెలుగు భాషను ఆదరిద్దాం, గౌరవిద్దాం.ఇదే మన భాషకు మనం చేసే సేవ. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన *ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు*.  వ్యావహారిక భాషోద్యమ నేత *గిడుగు వెంకట రామ్మూర్తి* జయంతిని పురస్కరించుకుని ఈరోజుని తెలుగు భాషాదినోత్సవంగా గుర్తించడం ముదావహం. *                                జై తెలుగు భాష  జై జై తెలుగు భాష *

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com