ఒమన్ 56వ జాతీయ దినోత్సవ వేడుకలు..ఒమన్ ప్రయాణికులకు షార్జా విమానాశ్రయం ప్రత్యేక స్వాగతం

- November 20, 2026 , by Maagulf
ఒమన్ 56వ జాతీయ దినోత్సవ వేడుకలు..ఒమన్ ప్రయాణికులకు షార్జా విమానాశ్రయం ప్రత్యేక స్వాగతం

ప్రత్యేక బహుమతుల పంపిణీ.. సంప్రదాయ అరబ్ ఆతిథ్యంతో ప్రయాణికులకు ఆహ్వానం

షార్జా: ఒమన్ 56వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం ఒమన్ ప్రయాణికులతో కలిసి వేడుకలు నిర్వహించింది. యూఏఈ, ఒమన్ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహబంధం, చారిత్రక సంబంధాలు, సోదరభావానికి ప్రతీకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ వేడుకల్లో షార్జా విమానాశ్రయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒమన్ నుంచి వచ్చిన ప్రయాణికులకు, ఒమన్‌కు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక జ్ఞాపికలను అందజేశారు. సంప్రదాయ అరబ్ ఆతిథ్యంలో భాగంగా ప్రత్యేక విందు మర్యాదలు అందించి వారిని ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంతో విమానాశ్రయంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రయాణికుల ప్రయాణ అనుభవాన్ని మరింత ఆనందదాయకంగా మార్చేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వివిధ దేశాలకు చెందిన ప్రయాణికుల జాతీయ వేడుకల్లో భాగస్వామ్యం కావడం, వారి పట్ల స్నేహభావం, ఆత్మీయతను చాటడం షార్జా విమానాశ్రయం లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం, సంప్రదాయ ఆతిథ్యం అందించడం ద్వారా చిరస్మరణీయమైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com