ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు..GCC దేశాల్లో ఒమన్ జెండా రంగులతో మెరిసిన భవనాలు

- November 20, 2026 , by Maagulf
ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు..GCC దేశాల్లో ఒమన్ జెండా రంగులతో మెరిసిన భవనాలు

యూఏఈ, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్‌లో ప్రత్యేక వేడుకలు

మస్కట్: ఒమన్ 56వ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాలు ఘనంగా వేడుకల్లో పాల్గొన్నాయి. నవంబర్ 20న నిర్వహించే ఒమన్ జాతీయ దినోత్సవం సందర్భంగా జీసీసీ దేశాల్లోని ప్రముఖ భవనాలు, చారిత్రక కట్టడాలను ఒమన్ జాతీయ జెండా రంగులతో అలంకరించారు. పలు ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు.

ఒమన్‌తో సోదర సంబంధాలు కలిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యమైంది. అధికారిక కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్యంతో పలు వేడుకలను నిర్వహించింది.

బహ్రెయిన్‌లోని ప్రముఖ భవనాలను ఒమన్ జాతీయ జెండా రంగులతో అలంకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక స్నేహబంధం, పరస్పర సహకారం, ఉమ్మడి విలువలకు ప్రతీకగా ఈ కార్యక్రమాలు నిలిచాయి.

కువైట్‌లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతమైన సౌక్ అల్ ముబారకీయాలో ఒమన్ జాతీయ జెండాలను ఎగురవేశారు. ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకల్లో కువైట్ ప్రజలు కూడా భాగస్వాములై తమ సోదరభావాన్ని చాటుకున్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న ఆత్మీయత, ఐక్యత ఈ వేడుకల్లో ప్రతిబింబించాయి.

సౌదీ అరేబియా, ఖతార్ దేశాల్లోనూ ప్రముఖ భవనాలను ఒమన్ జెండా రంగులతో అలంకరించి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

జీసీసీ దేశాల్లో నిర్వహించిన ఈ వేడుకలు గల్ఫ్ దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలు, ఐక్యత, పరస్పర గౌరవం, సోదరభావానికి నిదర్శనంగా నిలిచాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com