హౌతీలపై సౌదీ నేతృత్వంలో భారీ సైనిక ఆపరేషన్..!!
- November 21, 2026
రియాద్: సౌదీ అరేబియా, యెమెన్‌లోని పౌరులపై హౌతీ మిలిటెంట్లు జరుపుతున్న దాడులను అడ్డుకునేందుకు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు భారీ సైనిక ఆపరేషన్ ప్రారంభించాయి. పౌరులకు, కీలక మౌలిక సదుపాయాలకు ముప్పుగా మారిన హౌతీల సైనిక స్థావరాలు, ఆయుధాల సరఫరా కేంద్రాలే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు సంకీర్ణ దళాల సంయుక్త కమాండ్ వెల్లడించింది.
యెమెన్‌లోని సనా, సాదా, తైజ్ గవర్నరేట్లలో హౌతీలకు చెందిన సైనిక లక్ష్యాలపై దాడులు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ ఆపరేషన్‌లో సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తున్న 7 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. అలాగే హౌతీల సైనిక సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగిస్తున్న 6 వర్క్‌షాప్‌లను కూడా ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
ఆయుధాల అక్రమ రవాణా, సరఫరా, రవాణాకు ఉపయోగిస్తున్న మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సంకీర్ణ దళాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా సనాలో హౌతీల దాడులకు కారణమవుతున్న ముప్పు మూలాలను పూర్తిగా నిర్వీర్యం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపాయి. హౌతీ మిలిటెంట్లకు చెందిన ప్రధాన సరఫరా కేంద్రాల్లో ఒకదాన్ని కూడా సనాలో ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి.
ఇదిలా ఉండగా, హోడైదా పోర్టు నుంచి పౌరులు వెంటనే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సంకీర్ణ దళాల సంయుక్త కమాండ్ గతంలోనే హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో 30 శాతం పెరిగిన రెంట్స్..!!
- హౌతీలపై సౌదీ నేతృత్వంలో భారీ సైనిక ఆపరేషన్..!!
- ఒమన్ యువతకు శుభవార్త..!!
- బహ్రెయిన్‌లో ప్రవాస కార్మికుల విద్యార్హతలపై కఠిన తనిఖీలు..!!
- వారం రోజుల్లో 1,903 ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లను స్వాధీనం చేసుకున్న దుబాయ్ పోలీసులు
- Dubai Police Impound 1,903 Electric Bikes and Scooters in One Week, Warn Against Dangerous Stunts
- నేపాల్ పై భారత్-ఎ 306 పరుగుల చారిత్రక విజయం!
- ఒమన్ జాతీయ దినోత్సవ వేడుకలు..GCC దేశాల్లో ఒమన్ జెండా రంగులతో మెరిసిన భవనాలు
- ఒమన్ 56వ జాతీయ దినోత్సవ వేడుకలు..ఒమన్ ప్రయాణికులకు షార్జా విమానాశ్రయం ప్రత్యేక స్వాగతం
- ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు రోడ్ షోల్డర్ పై వాహనాలు నడిపితే జరిమానా..







