ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ వ్యవస్థలు

- November 22, 2026 , by Maagulf
ఇరాన్ వైమానిక దాడులను అడ్డుకున్న బహ్రెయిన్ రక్షణ వ్యవస్థలు

మనామా: బహ్రెయిన్ రాజ్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నుంచి జరిగిన పలు వైమానిక దాడులను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని బహ్రెయిన్ రక్షణ దళాల (BDF) జనరల్ కమాండ్ ప్రకటించింది. ఈ ఘటనల్లో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది.

బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ (BNA) ప్రచురించిన అధికారిక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించింది. అడ్డుకున్న వైమానిక దాడులకు సంబంధించిన శకలాలు పడటంతో స్వల్ప ఆస్తి నష్టం సంభవించినట్లు తెలిపింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది.

దేశంపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు బహ్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు పూర్తి అప్రమత్తతతో సిద్ధంగా ఉన్నాయని రక్షణ దళాల జనరల్ కమాండ్ పేర్కొంది.

బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగించడం ద్వారా ఇరాన్ క్రమబద్ధమైన శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తోందని జనరల్ కమాండ్ ఆరోపించింది. దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అవసరమైన రక్షణ చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

 

 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com