200 స్మగుల్డ్‌ మేకలు పట్టివేత

- August 29, 2016 , by Maagulf
200 స్మగుల్డ్‌ మేకలు పట్టివేత

హట్టా - ఒమన్‌ బోర్డర్‌ ద్వారా అక్రమ మార్గంలో వస్తున్న 250 మేకలుని యూఏఈ అథారిటీస్‌ సీజ్‌ చేశాయి. చేపల్ని తీసుకెళ్తున్న ట్రక్‌లో ఈ గోట్స్‌ని అక్రమంగా దాచిపెట్టారు. ట్రక్‌లో ఉన్న మేకల పరిస్థితి దయనీయంగా ఉందనీ, ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా వాటిని రవాణా చేస్తున్నారని అధికారులు చెప్పారు. ఇలా దారుణమైన పరిస్థితుల్లో మేకల్ని రవాణా చేయడం ద్వారా అనేకరకాలైన రోగాలు వ్యాప్తి చెందుతాయని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. స్మగ్లర్స్‌ వివరాలు ఇంతవరకు మినిస్ట్రీ ద్వార వెల్లడి కాలేదు. మినిస్ట్రీ అనుమతితో మాత్రమే మేకల్ని రవాణా చేయడానికి వీలుంది. మినిస్ట్రీకి చెందిన 18 అధికారిక క్వారంటీన్‌ సెంటర్స్‌ ద్వారా మాత్రమే యూఏఈలోకి మేకలు రవాణాని అనుమతిస్తారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com