ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- November 23, 2026
మస్కట్: ఒమన్‌లో జాతీయ సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయించే విధానాన్ని డిసెంబర్ 1నుంచి అమలు చేయనున్నట్లు నేషనల్ సబ్సిడీ కమిటీ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఈ కార్డు ద్వారా అర్హులైన వాహనదారులకు లీటరు డీజిల్‌ను 258 బైసాలకు అందించనున్నారు. రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వద్ద రిజిస్టర్ అయిన ప్రైవేట్, వాణిజ్య అవసరాలకు వినియోగించే డీజిల్ వాహనాలకు ఈ సబ్సిడీ వర్తించనుంది.
సబ్సిడీకి అర్హులైన లబ్ధిదారులకు కార్డు జారీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తూ మొబైల్‌కు SMS ద్వారా సమాచారం పంపించనున్నారు. నేషనల్ సబ్సిడీ సిస్టమ్ అప్లికేషన్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా కార్డు పొందేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కార్డు జారీ లేదా దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే నేషనల్ సబ్సిడీ సిస్టమ్ కాల్ సెంటర్ 24174000 నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
డీజిల్ వాహనదారులకు సబ్సిడీ ప్రయోజనాలను నేరుగా అందించడంతో పాటు, అర్హులైన వారికి నిర్ణీత ధరకు ఇంధనం అందుబాటులో ఉంచడం ఈ విధానం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!
- అవయవ మార్పిడి చికిత్సల్లో కింగ్ ఫైసల్ హాస్పిటల్ అరుదైన ఘనత..!!
- ఖతార్‌లో రెండో దశ ఎలక్ట్రిక్ రోబోటాక్సీల ట్రయల్స్..!!
- యూఎన్ ఆరోపణలను ఖండించిన బహ్రెయిన్..!!
- యూఏఈలో ఆన్లైన్ సెల్లర్స్ కు కొత్త రూల్స్..!!
- బైక్‌లు, క్యాంప్‌సైట్ అద్దె పేరుతో ఆన్లైన్ మోసాలు..
- దుబాయ్‌లో ఘనంగా తెలుగు చార్టర్డ్ అకౌంటెంట్ల వనభోజనాలు.. 350 మందికి పైగా హాజరు
- బహ్రెయిన్‌పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్
- యెమెన్‌లో వారం రోజుల్లో 1,269 పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసిన సౌదీ మసామ్ ప్రాజెక్టు







