దీపావళికి విడుదలకానున్న 'లక్ష్మీ బాంబ్‌'

- August 29, 2016 , by Maagulf
దీపావళికి విడుదలకానున్న 'లక్ష్మీ బాంబ్‌'

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌ పాత్రలో చేస్తోన్న చిత్రం 'లక్ష్మీ బాంబ్‌'. గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ''చాలెంజింగ్‌ పాత్ర చేస్తున్నాను. ఎగ్జయిటింగ్‌ సబ్జెక్ట్‌. ఇప్పటి వరకు చేయని డిఫరెంట్‌ క్యారెక్టర్‌. జడ్జ్‌ పాత్రలో కనపడతాను. సింగిల్‌ షెడ్యూల్‌లో ఏకధాటిగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం. క్లైమాక్స్‌ ఫైట్‌ను తమ్ముడు మనోజ్‌ ఆధ్వర్యంలో చేశాం.

దీపావళికి ముందుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం'' అని అన్నారు. 
దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ '' జయప్రద జస్టిస్‌ రుద్రమదేవి తర్వాత అంతటి పవర్‌ ఫుల్‌ రోల్‌ చేస్తుంది లక్ష్మీయే. మనోజ్‌ క్లైమాక్స్‌ ఫైట్‌ కంపోజ్‌ చేయడం ఎసెట్‌ అవుతుంది'' అని అన్నారు. ఈ చిత్రానికి డ్యాన్స్‌: కిరణ్‌, ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌ : నందమూరి హరి, పాటలు : కరుణాకర్‌, కాసర్లశ్యామ్‌, సంగీతం : సునీల్‌కశ్యప్‌, కెమెరా : మల్హర్‌భట్‌ జోషి, కథ, మాటలు : డార్లింగ్‌ స్వామి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com