‘ఫ్యామిలీ ప్యాక్’ ఫన్ ప్యాక్డ్ సినిమా: హీరో శ్రీ విష్ణు

- November 23, 2026 , by Maagulf
‘ఫ్యామిలీ ప్యాక్’ ఫన్ ప్యాక్డ్ సినిమా: హీరో శ్రీ విష్ణు


కింగ్ అఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ శ్రీ విష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ తో మరోసారి ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎంటర్‌టైనర్ 2027 సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. విచిత్రమైన క్యారెక్టర్లు, ఆసక్తికరమైన పరిస్థితులు, నవ్వులు పూయించే సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులకు పెద్ద ఫన్ రైడ్ ఇవ్వబోతున్నట్లు టీజర్ హామీ ఇస్తోంది.

ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. అయితే ఆయన వ్యక్తిత్వం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. బాధ్యతగా ఉండే ఫ్యామిలీ మెన్‌లా కాకుండా, తన కుటుంబం గురించి కూడా పెద్దగా పట్టించుకోని స్వార్థపరుడిగా కనిపిస్తారు. ఆయన ఇంట్లోని వ్యక్తుల లైఫ్ స్టయిల్ లో ఉన్న తేడాలను టీజర్ ఫన్నీగా చూపించింది. ఒకవైపు బోరబండ, మరోవైపు బంజారాహిల్స్ అంటూ రెండు ప్రాంతాల  లైఫ్ స్టయిల్ ని పోలుస్తూ కామెడీని పండించారు.

ఇలాంటి వ్యక్తి జీవితంలోకి తన పై అధికారి కూతుర  రావడంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఈ విచిత్రమైన పరిస్థితి నుంచి ఎలాంటి కామెడీ పుడుతుంది? ఎలాంటి గందరగోళం చోటు చేసుకుంటుంది? అనేది టీజర్‌లో చూపించిన హ్యూమర్ ద్వారా అర్థమవుతోంది.

ఇప్పటికే తన ఎంటర్‌టైనింగ్ కథనాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి కామెడీ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

శ్రీ విష్ణు తన డిఫరెంట్ యాటిట్యూడ్, బ్యాడీ లాంగ్వెజ్ తో మరోసారి తన కామెడీ టైమింగ్‌ తో అదరగొట్టారు. తన సహజమైన నటన, ఎంటర్‌టైనింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనిపించుకున్నారు. కామెడీ కోసం ప్రత్యేకంగా ప్రయత్నించినట్లు కాకుండా, సన్నివేశాల నుంచే సహజంగా నవ్వులు పుట్టేలా టీజర్ సాగింది. మొత్తంగా టీజర్ చాలా ఫ్రెష్‌గా, సరదాగా ఆకట్టుకుంటోంది.

హీరోయిన్‌గా సాక్షి మధోల్కర్ అందంగా కనిపించారు. శ్రీ విష్ణు, నరేష్ వీకే కాంబినేషన్ మరోసారి నవ్వులు పంచేలా ఉంది. శ్రీ విష్ణు తల్లిగా అభిరామి, తమ్ముడిగా బుల్లిరాజు, సాక్షి తండ్రిగా మురళీ శర్మ  పాత్రలు ఆకట్టుకున్నాయి. వీరితో పాటు ఇతర పాత్రలు కూడా సినిమాలో మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నాయి.

జె. యువరాజ్ కలర్‌ఫుల్ సినిమాటోగ్రఫీ టీజర్‌కు మంచి విజువల్ అప్పీల్ తీసుకొచ్చింది. చైతన్ భరద్వాజ్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్ సినిమా మూడ్‌కు చక్కగా సరిపోయింది. టీజర్‌లో ఆద్యంతం సంక్రాంతి పండగ వాతావరణం కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను గ్రాండ్ స్కేల్‌లో నిర్మిస్తున్నారు. అనిల్ పసల ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

గతంలో రామ్ అబ్బరాజుతో కలిసి పనిచేసిన భాను భోగవరపు, నందు సావిరిగాన ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. వీరి రచన కూడా ఈ ఎంటర్‌టైనర్‌కు ప్రధాన బలాల్లో ఒకటిగా నిలవనుంది. ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్ సినిమాపై మంచి అంచనాలు పెంచుతోంది. 2027 సంక్రాంతికి థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ ఫన్ ట్రీట్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నవీన్ గారికి, రవి గారికి థాంక్యూ. అలాగే ఆదిత్య గారు, అనిల్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు.  డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారు, బ్రహ్మ కడలి గారు, డీఓపీ యువరాజ్ గారు.. ఇలా అందరూ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మంచి టీమ్ వర్క్‌తో ఈ సినిమా చేశాం. ఫుల్ ఫన్ చాలా బాగా వచ్చింది. డైలాగ్స్ కూడా అదిరిపోయాయి. ‘సామజవరగమన’ విజయవంతమైన తర్వాత రామ్ అబ్బరాజుతో మరో సినిమా చేయాలనుకున్నాం. ఒక మంచి కథ దొరికితే కలిసి పనిచేద్దామని అనుకున్నాం. అలాంటి సమయంలో ఈ కథ వచ్చింది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో ఒక కొత్త యాంగిల్ ఉంటుంది. అది టీజర్‌లో, ట్రైలర్‌లో ఉండదు. మీరు థియేటర్‌లోనే ఎంజాయ్ చేస్తారు. సాక్షి చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. సుదర్శన్‌తో నేను చేసిన సినిమాలన్నీ హిట్టే. ఇది కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. సత్య కామెడీ అదిరిపోతుంది. వెన్నెల కిషోర్ గారి ట్రాక్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నరేష్ గారిది కూడా చాలా మంచి క్యారెక్టర్. బుల్లిరాజు నాతో పాటు సినిమా అంతా ఉంటాడు. ఇరగదీశాడు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమాను చాలా మంచి ఫన్ ప్యాక్‌తో సిద్ధం చేశాం. ఫ్యామిలీతో కలిసి ఫ్యాక్ద్ థియేటర్‌లో చూడండి.  థాంక్ యూ.

డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. టీజర్ కంటే ట్రైలర్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. సినిమా అంతకంటే అద్భుతంగా ఉంటుంది. భాను, నందుతో నా కొలాబరేషన్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ సినిమాలో ఫన్ అద్భుతంగా వర్కౌట్ అయింది. నవీన్ గారు, రవి గారు ఎప్పుడూ మాకు అందుబాటులో ఉంటూ అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. శ్రీ విష్ణు గారితో నాకు ఇది రెండో సినిమా. ఆయన నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. సంక్రాంతి రోజున ఈ సినిమా మీ అందరికీ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సంక్రాంతికి థియేటర్లన్నీ ఫ్యామిలీలతో ప్యాక్ అయితే, అది చూడటానికి చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ థియేటర్లలోనే సినిమా చూడాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ సాక్షి మధోల్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి చాలా హ్యాపీగా, ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సంక్రాంతి అనేది మనందరికీ పెద్ద పండుగ. అలాంటి పండుగకు మా సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. శ్రీ విష్ణు గారు కింగ్ అఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌. సంక్రాంతికి ‘ఫ్యామిలీ ప్యాక్’తో కలుద్దాం.

సుదర్శన్ మాట్లాడుతూ.. ఇప్పుడు మీరు టీజర్‌లో చూసింది చిన్న శాంపిల్ మాత్రమే. సినిమా అంతా ఫుల్ ఫన్‌గా ఉంటుంది. సామజ చూసి థియేటర్లలో ఎలా నవ్వుకున్నారో, దానికి రెండింతలు ఫన్ ‘ఫ్యామిలీ ప్యాక్’లో ఉంటుంది. 100 శాతం ఈ సినిమా మీ అందరికీ బాగా నచ్చుతుంది.

డీఓపీ యువరాజ్ మాట్లాడుతూ..‘ఫ్యామిలీ ప్యాక్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో అన్‌లిమిటెడ్ ఫన్ ఉంది. అందరూ సినిమాకు వచ్చి సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. శ్రీ విష్ణు గారితో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. డైరెక్టర్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు మేమంతా ఒక ఫ్యామిలీలా అయిపోయాం.

ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ.. మైత్రీ మూవీ మేకర్స్‌లో నాకు ఇది మొదటి సినిమా. మా మీద నమ్మకంతో ఈ సినిమాను ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. వారి నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. షూటింగ్ స్పాట్‌లో ఎప్పుడైతే అందరూ నవ్వుకుంటారో, ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని నేను నమ్ముతాను. ఈ సినిమా షూటింగ్‌లో మేమంతా ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాళ్లం. ఆ నవ్వులు థియేటర్లలో ప్రేక్షకులకు కూడా వస్తాయి. శ్రీ విష్ణు గారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.

నటీనటులు: శ్రీ విష్ణు, సాక్షి మధోల్కర్, నరేష్ వీకే, అభిరామి, మురళీ శర్మ, అన్నపూర్ణమ్మ, వెన్నెల కిషోర్, సుదర్శన్, సత్య, రోహిణి, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, గోపరాజు విజయ్, బుల్లిరాజు (రేవంత్), శ్రీ ముక్త, రఘుబాబు, మాణిక్ రెడ్డి, హరి ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, మధుమణి, గీతా సింగ్

టెక్నికల్ టీమ్:
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
కో-ప్రొడ్యూసర్: అనిల్ యెర్నేని
సీఈఓ: చెర్రీ
కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: భాను భోగవరపు, నందు సావిరిగాన
సినిమాటోగ్రఫీ: జె. యువరాజ్
మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్
ఎడిటర్: అనిల్ పసల
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
ఫైట్ మాస్టర్: పృథ్వీ
లిరిసిస్ట్: రామజోగయ్య శాస్త్రి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చెంబోలు సాయి ఆదిత్య
కాస్ట్యూమ్స్: రాజేష్ కమార్సు, విభా రెడ్డి
పీఆర్వో: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: వియాకి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com