దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- November 24, 2026
దుబాయ్: దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరుగుతున్న బిగ్ 5 గ్లోబల్ 2026 ప్రదర్శన సందర్భంగా కొన్ని పార్కింగ్ ప్రాంతాల్లో గంటకు Dh25 చొప్పున ఛార్జీ వసూలు చేయనున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ట్రేడ్ సెంటర్ పరిధిలోని 335X, 336X, 337X పార్కింగ్ జోన్లలో ఈ ప్రత్యేక ఛార్జీలు అమలులో ఉంటాయని తెలిపింది. నవంబర్ 26 వరకు నాలుగు రోజుల పాటు ఈ ధరలు కొనసాగనున్నాయి.
ప్రత్యేక కార్యక్రమాలు, ప్రదర్శనలు జరిగే ప్రాంతాల్లో పార్కింగ్ రద్దీని నియంత్రించేందుకు దుబాయ్‌లో వేరియబుల్ పార్కింగ్ ఫీజుల విధానాన్ని 2025 ప్రారంభంలో ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ఆయా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలను బట్టి పార్కింగ్ ఛార్జీలు మారుతుంటాయి. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పరిసరాల్లోని పార్కింగ్ ప్రాంతాలను పార్కిన్ సంస్థ 'గ్రాండ్ ఈవెంట్ జోన్'గా పేర్కొంటోంది.
ఏమిటీ బిగ్ 5 గ్లోబల్?
మిడిలిస్ట్, ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాల్లో అతిపెద్ద నిర్మాణ రంగ ప్రదర్శనగా బిగ్ 5 గ్లోబల్ గుర్తింపు పొందింది. నాలుగు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగ సంస్థలు, నిపుణులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ట్రేడ్ సెంటర్ పరిసరాలకు వచ్చే వాహనదారులు పార్కింగ్ ఛార్జీలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు







