ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- November 24, 2026
దోహా: సౌదీ అరేబియా నుంచి రోడ్డు మార్గంలో ఖతార్‌కు వచ్చే పర్యాటకులకు విజిట్ ఖతార్ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా QR150 వరకు విలువైన WOQOD ఇంధన వోచర్లతో పాటు ఉచిత ఈ-సిమ్‌ను అందిస్తోంది. Visit Qatar అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబర్ 27 వరకు అందుబాటులో ఉంటుంది.
ఖతార్‌లో రిజిస్టర్ కాని నంబర్ ప్లేట్లు కలిగిన వాహనాల్లో వచ్చే సందర్శకులు ఈ ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. అయితే వోచర్లు అందుబాటులో ఉన్న పరిమిత సంఖ్య ఆధారంగా పంపిణీ చేస్తారు. ఈ ఆఫర్ పొందాలనుకునే ప్రయాణికులు Visit Qatar వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపెయిన్ పేజీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నిబంధనలు, షరతులకు లోబడి ఈ ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఇక పొందిన ఇంధన వోచర్లను ఖతార్‌లోని ఏదైనా WOQOD పెట్రోల్ బంకులో వినియోగించుకోవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు







