కువైట్‌లో చాలెట్లలో అక్రమ కార్మికులపై చర్యలు..!!
- November 24, 2026
కువైట్ : కువైట్‌లో ఆర్థిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉన్న చాలెట్లలో నివాస, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిని పనిలో పెట్టుకోవడం లేదా వారికి వసతి కల్పించడంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. వారి పని స్వభావం, హోదాతో సంబంధం లేకుండా నిబంధనలను ఉల్లంఘించిన కార్మికులను నియమించుకోవడం నిషేధమని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ప్రభుత్వానికి చెందిన ఆస్తులను పరిరక్షించడం, ప్రజా ప్రయోజనాలను కాపాడటం, ప్రభుత్వ ఆస్తులను నిర్దేశించిన ప్రయోజనాలకే వినియోగించేలా చూడటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ స్టేట్ ప్రాపర్టీ అఫైర్స్ ద్వారా ఈ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ నిబంధనల అమలును నిర్ధారించేందుకు సంబంధిత ప్రభుత్వ విభాగాల సమన్వయంతో తనిఖీలు, పర్యవేక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.
చాలెట్లలో అక్రమంగా నివసిస్తున్న లేదా కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారిని పనిలో పెట్టుకున్నట్లు గుర్తిస్తే, వాటిని నమోదు చేసి సంబంధిత అధికారుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వానికి చెందిన చాలెట్లను వినియోగిస్తున్న వారంతా తమ వద్ద పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగ, నివాస అనుమతుల స్థితిని పరిశీలించుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఆస్తులను అనుమతించిన ప్రయోజనాలకే వినియోగించాలని, తనిఖీ బృందాలకు సహకరించాలని కోరింది.
ప్రభుత్వ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేస్తామని, ప్రభుత్వ ఆస్తుల సక్రమ వినియోగం, ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- సౌదీలో జీసీసీ వాహనాల గడువు ముగింపు..!!
- ఒమన్‌లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్..!!
- కువైట్‌లో చాలెట్లలో అక్రమ కార్మికులపై చర్యలు..!!
- బహ్రెయిన్‌లో డ్యామేజ్ అసెస్మెంట్ సర్టిఫికెట్ సేవలు ఆన్‌లైన్‌లోకి..!!
- గల్ఫ్ భద్రతకు దౌత్యం, ప్రాంతీయ సహకారం అవసరం: ఖతార్
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొని 11 మంది మృతి..!!
- ఉమ్ అల్ ఖువైన్లో ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!







