రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు

- November 24, 2026 , by Maagulf
రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు

రాస్ అల్ ఖైమా: రాస్ అల్ ఖైమాలో నవంబర్ 24న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది గాయపడినట్లు నేషనల్ అంబులెన్స్ వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర వైద్య బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స అందించాయి.

గాయపడిన వారిలో 14 మందిని మెరుగైన వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.

41 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగా ట్రక్కును రోడ్డు పక్కన నిలిపి ఉంచినట్లు సమాచారం.

ఈ ఘోర ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com