నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం
- November 24, 2026
విశాఖపట్నం: ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు–బాలలు 2026కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని మిజోరం, ఒడిశా రాష్ట్రాల పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆహ్వానించారు.
ఈ మేరకు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు డా. గజల్ శ్రీనివాస్ విశాఖపట్నంలో కంభంపాటి హరిబాబును, విశ్వ హిందీ పరిషత్తు అధ్యక్షుడు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను కలిసి మహాసభల నిర్వహణ, కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.
డిసెంబర్ 19, 20 తేదీల్లో ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఈ మహాసభలు జరగనున్నాయి. బాలల కోసం తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఒక చారిత్రాత్మక ఘట్టమని డా. గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పట్ల చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించడంతో పాటు, భావితరాలకు తెలుగు భాషా వైభవాన్ని పరిచయం చేయడమే ఈ మహాసభల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
డిసెంబర్ 20వ తేదీ ఉదయం జరిగే ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులతో పాటు ప్రతిభావంతులైన బాలబాలికలను సత్కరించాలని పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబును డా. గజల్ శ్రీనివాస్ కోరారు. ఆయన అందించే స్ఫూర్తిదాయక సందేశం బాలబాలికలకు ఎంతో ప్రేరణనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!
- నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలకు పూర్వ గవర్నర్ కంభంపాటి హరిబాబుకు ఆహ్వానం
- రాస్ అల్ ఖైమా బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారిలో భారతీయులు..
- గల్ఫ్టైనర్ గ్రూప్ సీఈఓతో భారత కాన్సుల్ జనరల్ భేటీ..
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 26 మందికి గాయాలు
- జీఎంఆర్ కార్గో నిల్వ సామర్థ్యం 140 శాతం పెంపు
- ఫేస్బుక్, స్నాప్‌చాట్, పబ్జీతో సహా 87 యాప్‌లను నిషేధించిన భారత సైన్యం
- సౌదీలో జీసీసీ వాహనాల గడువు ముగింపు..!!
- ఒమన్‌లో ముగ్గురు ఆసియన్లు అరెస్ట్..!!
- కువైట్‌లో చాలెట్లలో అక్రమ కార్మికులపై చర్యలు..!!







