అబుదాబి–కొచ్చి ఇండిగో విమానంలో ప్రయాణికుడి పై దాడి.. వ్యక్తి అరెస్ట్

- November 25, 2026 , by Maagulf
అబుదాబి–కొచ్చి ఇండిగో విమానంలో ప్రయాణికుడి పై దాడి.. వ్యక్తి అరెస్ట్

అబుదాబి: అబుదాబి నుంచి కేరళలోని కొచ్చికి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తోటి ప్రయాణికుడిపై దాడి చేసి గాయపరిచిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మీడియా కథనాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పీటీఐ కథనం ప్రకారం, నిందితుడిని రోషన్ మార్టిన్‌గా, దాడికి గురైన ప్రయాణికుడిని యూసుఫ్‌గా గుర్తించారు.

విమానంలో సీటు నంబర్ 30Dలో కూర్చున్న రోషన్ మార్టిన్, 31B సీటులో ఉన్న యూసుఫ్‌పై ఒక్కసారిగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో యూసుఫ్ కళ్లద్దాలు పగిలిపోవడంతో పాటు కుడి కంటి సమీపంలో గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా తన బెల్టును తీసి యూసుఫ్ గొంతు బిగించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 115(2), 118(1) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సెక్షన్లు స్వచ్ఛందంగా గాయపరచడం, ప్రమాదకరమైన ఆయుధాలు లేదా పద్ధతుల ద్వారా గాయపరచడానికి సంబంధించినవి.

అయితే, విమానంలో ఈ ఘర్షణకు దారితీసిన కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. బాధితుడి వాంగ్మూలాన్ని త్వరలో నమోదు చేసి, తదుపరి విచారణ చేపడతామని పోలీసులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com