యూఏఈ వీరులకు భారత రక్షణ కార్యదర్శి ఘన నివాళులు

- November 26, 2026 , by Maagulf
యూఏఈ వీరులకు భారత రక్షణ కార్యదర్శి ఘన నివాళులు
అబుదాబి: యూఏఈ కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు భారత రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు.
 
14వ భారత్–యూఏఈ సంయుక్త రక్షణ సహకార కమిటీ (JDCC) సమావేశానికి ముందు అబుదాబిలోని వహత్ అల్ కరామా స్మారక స్థలాన్ని సందర్శించిన ఆయన, అమర వీరులకు పుష్పాంజలి ఘటించి గౌరవ వందనం సమర్పించారు.
 
ఈ కార్యక్రమం భారత్, యూఏఈ దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహబంధం, పరస్పర విశ్వాసం, వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది. రెండు దేశాల మధ్య రక్షణ రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com