కువైట్‌లో వాహనదారుల అలెర్ట్.. సల్మియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- November 26, 2026
కువైట్ సిటీ: కువైట్‌లోని సల్మియా ప్రాంతంలో రోడ్డు మరమ్మతుల పనుల కారణంగా అమ్మాన్ స్ట్రీట్, అల్-ముఘీరా బిన్ షుబా స్ట్రీట్ కలిసే సర్కిల్ ను తాత్కాలికంగా మూసివేయనున్నారు. పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ, జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.
2026 నవంబర్ 26 అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ మూసివేత ఆంక్షలు అమల్లోకి వస్తాయి. నవంబర్ 29 ఉదయం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఈ సమయంలో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించాలని అధికారులు సూచించారు. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, రహదారి సంకేతాలను పాటించాలని కోరారు. రోడ్ మరమ్మతుల పనుల కారణంగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో వాహనదారుల అలెర్ట్.. సల్మియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- యూఏఈ వీరులకు భారత రక్షణ కార్యదర్శి ఘన నివాళులు
- యూఏఈలో గత 20 ఏళ్లలో జరిగిన మేజర్ యాక్సిడెంట్స్ ఇవే..!!
- వాట్సప్‌లో సరికొత్త ఫీచర్..ఇక మెసేజ్‌లు ఒక్కసారే చూడొచ్చు!
- బహ్రెయిన్‌లో చెత్త నిర్వహణ చట్టంలో మార్పులు..!!
- అరుణాచల్ సరిహద్దు పై భారత్-చైనా కీలక చర్చలు..10 రోజుల పాటు సమావేశాలు
- ఖతార్‌లో ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్ మూసివేత..!!
- సౌదీలో 97 శాతానికి చేరిన ఆరోగ్య సేవల కవరేజీ..!!
- ఒమన్‌లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు..!!
- ఏఐ, 3డీ టెక్నాలజీతో రోడ్డు ప్రమాదాల పునర్నిర్మాణం.. దుబాయ్ పోలీసుల వినూత్న ప్రయోగం







