తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం..భారీ విరాళం పై సీఎం చంద్రబాబు స్పందన

- November 27, 2026 , by Maagulf
తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం..భారీ విరాళం పై సీఎం చంద్రబాబు స్పందన

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఒక భక్తుడు అత్యంత భారీ స్థాయిలో స్వర్ణాభరణాలను కానుకగా సమర్పించారు.చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వర్ధమాన్ జైన్, సుమారు రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను శ్రీ వారికి విరాళంగా అందజేశారు. తిరుమలలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరయ్యారు.

121 కిలోల స్వర్ణాభరణాల ప్రత్యేకతలు
ఈ భారీ విరాళంలోని ఆభరణాల వివరాలను పరిశీలిస్తే..106 కిలోల బంగారంతో శ్రీవారి అలంకరణ నిమిత్తం వజ్రాలు, విలువైన రత్నాలు పొదిగిన పాదకవచాలు, కౌస్తుభం, నాగాభరణాలు వంటి అద్భుత ఆభరణాలను తయారు చేయించారు. మిగిలిన 15 కిలోల బంగారంతో శ్రీ పద్మావతి అమ్మవారి కోసం ప్రత్యేకంగా బంగారు వస్త్రాన్ని రూపొందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే దాత వర్ధమాన్ జైన్ ఈ ఆభరణాలను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులకు అధికారికంగా అప్పగించారు.

అచంచల భక్తికి నిదర్శనమన్న సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. భక్తుడు సమర్పించిన ఈ విరాళం తిరుమల చరిత్రలో ఒక అరుదైన ఘట్టమని కొనియాడారు. తరతరాలుగా భక్తులు ఏడుకొండలవాడిపై చూపిస్తున్న అచంచల విశ్వాసానికి, భక్తిభావానికి ఈ కానుక నిదర్శనమని పేర్కొన్నారు. తిరుమల క్షేత్రంలో కలిగే ఆధ్యాత్మిక అనుభూతి మరెక్కడా లభించదని అన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com