కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!

- November 26, 2026 , by Maagulf
కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!
కువైట్: నివాస ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్యాచిలర్లకు వసతి కల్పిస్తున్న ఇళ్లపై కువైట్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఖైతాన్ (Khaitan) ప్రాంతంలో నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 219 నివాస భవనాలకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశారు. కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో ఒంటరి పురుషులకు వసతి కల్పిస్తున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ తనిఖీలు నిర్వహించారు. 
 
ఈ ప్రత్యేక తనిఖీ కార్యక్రమంలో కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, కువైట్ మున్సిపాలిటీ, పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అధికారులు పాల్గొన్నారు. తనిఖీల్లో మొత్తం 219 నివాస ఆస్తులు నిబంధనలకు విరుద్ధంగా బ్యాచిలర్ల వసతి కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. 
 
దీంతో నిబంధనలు ఉల్లంఘించిన అన్ని ఆస్తులకు అక్కడికక్కడే విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. కుటుంబాల కోసం కేటాయించిన నివాస ప్రాంతాల్లో నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడం, నివాస ప్రాంతాల్లో క్రమబద్ధతను కొనసాగించడం లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com