ఈజిప్టు అధ్యక్షుడు అల్‌సీసీతో ఖతార్ అమీర్ చర్చలు..!!
- November 27, 2026
కైరో: ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌థానీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్‌సీసీతో అధికారిక చర్చలు జరిపారు. ఈజిప్టు రాజధాని కైరోలోని అల్ ఇత్తిహాదియా ప్యాలెస్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఖతార్ అమీర్‌కు, ఆయన వెంట వచ్చిన ప్రతినిధి బృందానికి ఈజిప్టు అధ్యక్షుడు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన ఇరు సోదర దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలు, వాటి ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
అనంతరం షేక్ తమీమ్ మాట్లాడుతూ.. తనకు, ప్రతినిధి బృందానికి ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం అందించినందుకు ఈజిప్టు అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉమ్మడి ప్రయత్నాలను కొనసాగిస్తూ, అన్ని రంగాల్లో సంబంధాలను మరింత విస్తరించాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో గిజా గవర్నరేట్‌లోని రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి షేక్ తమీమ్ సంతాపం తెలిపారు. ఈజిప్టు అధ్యక్షుడు అల్‌సీసీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
చర్చల్లో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాటిని వివిధ రంగాల్లో మరింత అభివృద్ధి చేసే మార్గాలపై నేతలు చర్చించారు. ముఖ్యంగా పెట్టుబడులు, ఇంధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించారు. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. గాజా ప్రాంతంలోని తాజా పరిస్థితులు, కాల్పుల విరమణను పటిష్ఠం చేసేందుకు కొనసాగుతున్న ఉమ్మడి మధ్యవర్తిత్వ ప్రయత్నాలపై చర్చించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించేందుకు దౌత్యపరమైన సమన్వయాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
అనంతరం ఖతార్ అమీర్, ఆయన వెంట వచ్చిన ప్రతినిధి బృందం గౌరవార్థం ఈజిప్టు అధ్యక్షుడు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో టీమిండియా ‘ఎ’ జట్టుకు ఘన సత్కారం..అభినందించిన భారత రాయబారి
- ఈజిప్టు అధ్యక్షుడు అల్‌సీసీతో ఖతార్ అమీర్ చర్చలు..!!
- తిరుమల చరిత్రలో అరుదైన ఘట్టం..భారీ విరాళం పై సీఎం చంద్రబాబు స్పందన
- ద్వైపాక్షిక ఆర్థిక సహకారంపై ఒమన్–జపాన్ చర్చలు..!!
- సౌదీలో 77 శాతం మంది ప్రజలకు చేరువలోనే పార్కులు..!!
- బహ్రెయిన్‌లో ఈ-బైక్‌లతో పిల్లలకు ప్రమాదం..!!
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026 ప్రారంభం.. ప్రపంచ స్థాయి యాట్స్ ఆవిష్కరణలతో సందడి
- హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. గల్లంతైన సిబ్బంది మృతి: ADNOC ప్రకటన
- ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్న కువైట్.. నలుగురికి గాయాలు
- కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!







