డిసెంబర్ 5 నుంచి బహ్రెయిన్ రైతుల మార్కెట్ సీజన్ ప్రారంభం..!!
- November 29, 2026
మనామా: బహ్రెయిన్‌లో 14వ రైతుల మార్కెట్ సీజన్ 2026–2027 డిసెంబర్ 5న ప్రారంభం కానుంది. బుదాయా బొటానికల్ గార్డెన్‌లో ఈ మార్కెట్‌ను మున్సిపాలిటీ వ్యవహారాలు, వ్యవసాయ శాఖ మంత్రి ఇంజినీర్ వేల్ బిన్ నాసర్ అల్ ముబారక్ ప్రారంభించనున్నారు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్, ఎస్టీసీ బహ్రెయిన్ భాగస్వామ్యంతో, బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్స్ అథారిటీ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఈసారి మార్కెట్‌లో 39 మంది బహ్రెయిన్ రైతులు తమ ఉత్పత్తులతో పాల్గొననున్నారు. గత సీజన్‌తో పోలిస్తే రైతుల భాగస్వామ్యం సుమారు 18.2 శాతం పెరిగింది. సీజన్ ముగిసే వరకు ప్రతి శనివారం మార్కెట్ కొనసాగుతుంది. దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి రాజు హమద్ బిన్ ఈసా అల్ ఖలీఫా నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల పెంపు, ఆహార భద్రత బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మార్గదర్శకత్వంలో రైతులకు మరిన్ని అవకాశాలు కల్పించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. రైతుల మార్కెట్ స్థానిక వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసే ముఖ్యమైన వేదికగా అభివృద్ధి చెందుతోందని మంత్రి తెలిపారు.
రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెరగడంతో పాటు బహ్రెయిన్‌లో పండించే పంటలకు మార్కెట్లలో గుర్తింపు లభిస్తోందని పేర్కొన్నారు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ సెక్రటరీ జనరల్ షైఖా మరమ్ బింట్ ఈసా అల్ ఖలీఫా మాట్లాడుతూ.. రైతుల మార్కెట్ వరుస సీజన్లలో స్థానిక రైతులకు అండగా నిలుస్తున్న జాతీయ కార్యక్రమంగా గుర్తింపు పొందిందన్నారు.
రైతులు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు, వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ మార్కెట్ ఉపయోగపడుతోందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసే అలవాటును ప్రజల్లో ప్రోత్సహించాలని ఆమె కోరారు. ఎస్టీసీ బహ్రెయిన్ ప్రభుత్వ వ్యవహారాల విభాగం వైస్ ప్రెసిడెంట్ షైఖ్ జియాద్ బిన్ ఫైసల్ అల్ ఖలీఫా మాట్లాడుతూ.. రైతుల మార్కెట్‌కు తమ సంస్థ కొనసాగిస్తున్న భాగస్వామ్యం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ఉత్పత్తిదారులు, చిన్న వ్యాపారాలు, కుటుంబ ఆధారిత ఉత్పత్తి యూనిట్లకు ఈ మార్కెట్ మంచి అవకాశాలను కల్పిస్తోందని పేర్కొన్నారు.
ఈసారి మరిన్ని ప్రత్యేక ఆకర్షణలు
14వ సీజన్‌లో మార్కెట్ ప్రాంగణాన్ని విస్తరించడంతో పాటు సందర్శకుల సౌకర్యాలు, కార్యక్రమాల్లో మార్పులు చేయనున్నారు. రైతులతో పాటు తేనె ఉత్పత్తిదారులు, ఖర్జూరం సాగుదారులు, మొక్కల నర్సరీలు, వ్యవసాయ సంస్థలు పాల్గొననున్నాయి. రెస్టారెంట్లు, కేఫ్‌లు, చిన్న వ్యాపారాలు, కుటుంబ ఆధారిత ఉత్పత్తుల విక్రయదారులకు కూడా అవకాశం కల్పించనున్నారు. వ్యవసాయం, ప్రకృతి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించడం ఈ సీజన్ ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో పిల్లల డిజిటల్ భద్రతపై పేరెంట్స్ కు కీలక సూచనలు..!!
- సౌదీలో వారం రోజుల్లో 9,169 మంది అరెస్ట్..!!
- డిసెంబర్ 5 నుంచి బహ్రెయిన్ రైతుల మార్కెట్ సీజన్ ప్రారంభం..!!
- ఒమన్ జాతీయ దినోత్సవ సెలవుల్లో సందడే సందడి..!!
- బిగ్ టికెట్ లక్కీ డ్రా.. నలుగురు భారతీయ ప్రవాసులకు తలా Dh25,000..!!
- డిజిటల్ యుగంలోనూ పుస్తకాలపై Gen Z, Gen Alpha ఆసక్తి..!!
- వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 55th Eid Al Etihad Team announces nationwide celebration venues
- బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
- దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!







