దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- November 28, 2026
దోహా: ఖతార్ రాజధాని దోహాలో ప్రజా రవాణా సౌకర్యాలను మరింత విస్తరించేందుకు కొత్తగా మూడు మెట్రోలింక్ బస్ రూట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. నవంబర్ 29 (ఆదివారం) నుంచి ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త రూట్ల ద్వారా అల్ వాబ్, అల్ రయ్యాన్ అల్ ఖదీమ్, లుసైల్ క్యూ ఎన్బీ, అల్ అజీజియా మెట్రో స్టేషన్ల పరిధిలోని నాలుగు ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
M136 రూట్: లుసైల్ క్యూ ఎన్బీ స్టేషన్ ఎగ్జిట్ 2 పక్కనే ఉన్న లుసైల్ బస్ స్టేషన్ నుంచి ఈ సర్వీసు ప్రారంభమవుతుంది. ఇజ్ఘావా ప్రాంతంతో పాటు హ్యూస్టన్ అమెరికన్ మెడికల్ సెంటర్, ఇమ్నీఫా స్ట్రీట్ ప్రాంతాలకు బస్సులు నడుస్తాయి. ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.
M201 రూట్: అల్ రయ్యాన్ అల్ ఖదీమ్ స్టేషన్ ఎగ్జిట్ 2, అల్ వాబ్ క్యూ ఎల్ ఎం స్టేషన్ ఎగ్జిట్ 1 నుంచి ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. లుఐబ్ ప్రాంతానికి సేవలందించే ఈ బస్సులు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి నడుస్తాయి.
M309 రూట్: అల్ అజీజియా మెట్రో స్టేషన్ ఎగ్జిట్ 1 నుంచి ఈ సర్వీసు ప్రారంభమవుతుంది. ముయిథర్, న్యూ అల్ రయ్యాన్ ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పిస్తుంది. ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు నడుస్తుంది.
కొత్త మెట్రోలింక్ సర్వీసుల ప్రారంభంతో ఆయా ప్రాంతాల ప్రజలకు మెట్రో స్టేషన్లకు చేరుకోవడం మరింత సులభం కానుంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణికులకు ఈ రూట్లు ఉపయోగపడనున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
- దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!
- ఇరాన్ దాడిలో గాయపడిన వారికి పరామర్శించిన రక్షణ మంత్రి..!!
- ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భవన్స్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి
- పేద మహిళలను అక్రమంగా గల్ఫ్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు..భారత్ ట్రావెల్స్ యజమాని అరెస్ట్
- కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ పై తెలంగాణ డీజీపీ సమీక్ష..







