ఖతార్ లో పిల్లల డిజిటల్ భద్రతపై పేరెంట్స్ కు కీలక సూచనలు..!!

- November 29, 2026 , by Maagulf
ఖతార్ లో పిల్లల డిజిటల్ భద్రతపై పేరెంట్స్ కు కీలక సూచనలు..!!

దోహా: ఇంటర్నెట్ వినియోగంలో పిల్లలకు ఎదురయ్యే ప్రమాదాలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) సూచించింది. ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి భయపెట్టే లేదా ఆందోళన కలిగించే సందేశాలు వస్తే వాటి గురించి వెంటనే తల్లిదండ్రులకు చెప్పేలా పిల్లలను ప్రోత్సహించాలని కోరింది. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో పిల్లలకు సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించడం, డిజిటల్ భద్రతను పెంపొందించడం ఎంతో ముఖ్యమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సందేశాలు వస్తే వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం ఇవ్వకూడదని పిల్లలకు నేర్పించాలని సూచించింది. అలాగే ఆన్‌లైన్‌లో తమ ఫొటోలు, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్తలు చెప్పాలని తెలిపింది. పిల్లలు తమకు అసౌకర్యంగా అనిపించిన లేదా భయాన్ని కలిగించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా తల్లిదండ్రులతో చెప్పగలిగే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలని పేర్కొంది.

ఆన్‌లైన్‌లో అనుమానాస్పద లేదా ఆందోళన కలిగించే సందేశాలు వచ్చినప్పుడు వాటికి స్పందించకుండా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేసే అలవాటు చేయడం ద్వారా సైబర్ ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించవచ్చని ఖతార్ హోం శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com