ఖతార్ లో పిల్లల డిజిటల్ భద్రతపై పేరెంట్స్ కు కీలక సూచనలు..!!
- November 29, 2026
దోహా: ఇంటర్నెట్ వినియోగంలో పిల్లలకు ఎదురయ్యే ప్రమాదాలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) సూచించింది. ఆన్లైన్లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి భయపెట్టే లేదా ఆందోళన కలిగించే సందేశాలు వస్తే వాటి గురించి వెంటనే తల్లిదండ్రులకు చెప్పేలా పిల్లలను ప్రోత్సహించాలని కోరింది. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన సందేశంలో పిల్లలకు సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించడం, డిజిటల్ భద్రతను పెంపొందించడం ఎంతో ముఖ్యమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సందేశాలు వస్తే వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాధానం ఇవ్వకూడదని పిల్లలకు నేర్పించాలని సూచించింది. అలాగే ఆన్లైన్లో తమ ఫొటోలు, వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్తలు చెప్పాలని తెలిపింది. పిల్లలు తమకు అసౌకర్యంగా అనిపించిన లేదా భయాన్ని కలిగించిన విషయాలను ఎలాంటి సంకోచం లేకుండా తల్లిదండ్రులతో చెప్పగలిగే వాతావరణాన్ని ఇంట్లో కల్పించాలని పేర్కొంది.
ఆన్లైన్లో అనుమానాస్పద లేదా ఆందోళన కలిగించే సందేశాలు వచ్చినప్పుడు వాటికి స్పందించకుండా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేసే అలవాటు చేయడం ద్వారా సైబర్ ప్రమాదాల నుంచి పిల్లలను రక్షించవచ్చని ఖతార్ హోం శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో పిల్లల డిజిటల్ భద్రతపై పేరెంట్స్ కు కీలక సూచనలు..!!
- సౌదీలో వారం రోజుల్లో 9,169 మంది అరెస్ట్..!!
- డిసెంబర్ 5 నుంచి బహ్రెయిన్ రైతుల మార్కెట్ సీజన్ ప్రారంభం..!!
- ఒమన్ జాతీయ దినోత్సవ సెలవుల్లో సందడే సందడి..!!
- బిగ్ టికెట్ లక్కీ డ్రా.. నలుగురు భారతీయ ప్రవాసులకు తలా Dh25,000..!!
- డిజిటల్ యుగంలోనూ పుస్తకాలపై Gen Z, Gen Alpha ఆసక్తి..!!
- వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 55th Eid Al Etihad Team announces nationwide celebration venues
- బహ్రెయిన్‌లో ఫుడ్ ట్రక్కుల వ్యాపారంపై కొత్త చట్టం..!!
- దోహా మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!!







