విజయవాడ మెట్రో రైలు నిర్మాణంలో మరో ముందడుగు
- August 30, 2016
విజయవాడ మెట్రో రైలు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టుకు సంబంధించి దిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్‌తో అమరావతి మెట్రో రైల్ కార్పోరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. కొద్దిరోజుల క్రితం వరకు మెట్రో ప్రాజెక్టులో ఎలాంటి పురోగతి లేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే రూ.300 కోట్లు నిధులు విడుదల చేయడంతో ఈ ప్రక్రియ వూపందుకుంది. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో భూసేకరణ చేపట్టనున్నారు. గతంలో మెట్రో ప్రాజెక్టు కోసం టెండర్లు పిలిచినా వాటి గడువు పూర్తయినందున రద్దు చేశారు. దీంతో త్వరలోనే మరో దఫా టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. మరోవైపు జైకా నుంచి రుణం తీసుకోవాలన్న ఆలోచనను అధికారులు విరమించుకున్నారు.
రుణమంజూరు ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు జైకా నిబంధనలు ప్రాజెక్టుని ముందుకు సాగనిచ్చేలా లేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచబ్యాంకుతో పాటు అనేక విదేశీ సంస్థలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తున్న తరుణంలో నిధుల సేకరణలో ఇబ్బందులు ఎదురుకావని మెట్రోరైల్ ఎండీ రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







