మెసేజింగ్ సర్వీసు వాట్సాప్ పాలసీ పై హైకోర్టులో సవాల్
- August 31, 2016
పాపులర్ మెసేజింగ్ సర్వీసు యాప్ వాట్సాప్ ఇటీవల తీసుకున్న ప్రైవేట్ పాలసీ మార్పులపై సవాళ్లు ఎదురవుతున్నాయి. పేరెంట్ కంపెనీ ఫేస్ బుక్ తో వాట్సాప్ డేటా షేరింగ్ ను సవాల్ చేస్తూ ఓ ఇద్దరు విద్యార్థులు కోర్టుకెక్కారు. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ, 2012లో నిర్ణయించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, లక్షలాది యూజర్ల ప్రైవసీ హక్కులను హరిస్తుందని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. శ్రేయా సేథీ, కర్మన్య సింగ్ సారిన్ అనే వాట్సాప్ యూజర్లు ఢిల్లీ హైకోర్టులో ఈ పిల్ ను ఫైల్ చేశారు.
ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ జీ రోహిణి, జస్టిస్ సంగీతా ధింగ్రా సెహగల్ తో కూడిన బెంచ్ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్(డీఓటీ), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)లకు నోటీసులు జారీచేసింది.
సెప్టెంబర్ 14లోపు ఈ పిల్ పై తమ స్పందన తెలపాలని ఆదేశించింది. గతవారంలోనే ఈ కొత్త ప్రైవసీ పాలసీని వాట్సాప్ ప్రకటించింది. పేరెంట్ కంపెనీతో యూజర్ల డేటాను షేర్ చేసుకోనున్నట్టు వెల్లడించింది. ఫోటోలు, మెసేజ్ లు మాత్రం షేర్ చేయడం లేదని వాట్సాప్ తెలిపింది.
సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త పాలసీని కమర్షియల్ అడ్వర్ టైజింగ్ కు, మార్కెటింగ్ కు యూజర్ల డేటాను వాడుకోనున్నట్టు ఫేస్ బుక్, వాట్సాప్ లు వెల్లడించాయి. అయితే ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని, ఈ కంపెనీలు వ్యవహరిస్తున్న తీరు యూజర్ల ప్రైవసీ హక్కులను హరిస్తుందని ఆరోపించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







