కాశ్మీర్ లో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాదులు

- September 01, 2016 , by Maagulf
కాశ్మీర్ లో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాదులు

పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు పట్టుకున్నాయి. కీలక సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు బారాముల్లా జిల్లాలోని పట్టాన్ నగరంలో సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 26 ఏళ్ళ షౌకత్ అహ్మద్ గానై, 34 ఏళ్ల పర్వేజ్ ఆహ్ మీర్ అనే ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. రెండు ఏకే 47 రైఫిళ్ళు, రెండు గ్రనైడ్ లాంఛర్లు, ఆర్మీ, పోలీస్ యూనిఫార్మ్, యుద్ధ కథనాల పుస్తకాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com