సెప్టెంబర్‌ 12 - ఈద్‌ అల్‌ అధా తొలి రోజు

- September 01, 2016 , by Maagulf
సెప్టెంబర్‌ 12 - ఈద్‌ అల్‌ అధా తొలి రోజు

సౌదీ మీడియా వర్గాల ప్రకారం, సౌదీ ప్రభుత్వం ఈద్‌ అల్‌ అధా తొలి రోజును సెప్టెంబర్‌ 12గా ప్రకటించింది. యాన్యువల్‌ ఫిలిగ్రిమేజ్‌ ముగింపు అయిన అరాఫత్‌ డే ఆదివారం, సెప్టెంబర్‌ 11 కానుంది. ముస్లిం యాత్రికులు మక్కా శివార్లలోని మౌంట్‌ అరాఫత్‌పైకి చేరిన మరుసటి రోజు ఈద్‌ అల్‌ అధా అవుతుంది. హిజ్రి నెలలోని ఆఖరి రోజును ధు అల్‌ ఖాదా, ధు అల్‌ హజ్జా ఆ మరుసటి రోజు వస్తుంది. ఇవి సెప్టెంబర్‌ 2, 3 తేదీల్లో ఉంటాయి. ఐదు రోజుల హజ్‌తో అరాఫత్‌ అసోసియేట్‌ అయి ఉంటుంది. ఇంటర్నేషనల్‌ ఆస్ట్రనామికల్‌ సెంటర్‌ (ఐఎసి) ఇప్పటికే సెప్టెంబర్‌ 12 సోమవారం ఈద్‌ అల్‌ అదా తొలి రోజుగా నిర్ణయించింది. ఇండోనేసియా, మలేసియా, బ్రూనై, టర్కీ మరియు జపాన్‌లలో ఈ రోజున నిర్వహిస్తారు. ఐఏఎస్‌, అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న సైంటిఫిక్‌ సెంటర్‌. ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందినవారు పనిచేస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com