డౌన్‌టౌన్‌ దుబాయ్‌లో ఇజెడ్‌ 10 హల్‌చల్‌

- September 02, 2016 , by Maagulf
డౌన్‌టౌన్‌ దుబాయ్‌లో ఇజెడ్‌ 10 హల్‌చల్‌

జిసిసి రీజియన్‌లో తొలి డ్రైవర్‌ లెస్‌ కారు దుబాయ్‌ డౌన్‌టౌన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 10 మంది కూర్చునేందుకు వీలున్న ఈ కారు గురువారం నుంచి మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ బలైవార్డ్‌లో సట్లింగ్‌ చేస్తోంది. ఇజెడ్‌10 తొలి రైడర్‌ గ్లాడిస్‌ రెగో మాట్లాడుతూ, అద్భుతమైన ప్రయాణానుభూతిని పొందినట్లు చెప్పారు. తక్కువ దూరం గల ప్రయాణాలకు ముందుగా ప్రోగ్రామ్‌ చేసుకుని, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రయాణించవచ్చని తయారీదారులు వెల్లడించారు. ప్రయాణీకులు అత్యద్భుతమైన అనుభూతిని పొందుతున్నారు. 15 కెవి బ్యాటరీతో ఇజెడ్‌10 వాహనం నడుస్తుంది. నాలుగు నిమిషాల ప్రీ ప్రోగ్రామ్డ్‌ ప్రయాణంలో మొత్తం 700 మీటర్ల దూరం ప్రయాణించినట్లు ఏడేళ్ళ రోక్సానె డి కోస్టా చెప్పారు. విదా హోటల్‌ నుంచి దుబాయ్‌ ఒపెరా వరకు ఈ ప్రయాణం సాగింది. ఇజె10 అత్యధికంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ప్రయోగ దశలో కేవలం గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com