విడుదలైన 'త్రివిక్రమన్' ట్రైలర్
- September 02, 2016
త్రివిక్రమపాండ్యన్ అనే రాజు మరణానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడానికి వెళ్లిన బృందం ఎదుర్కొన్న పరిస్థితులు, పరిణామాల సమాహారంగా సోషియా ఫాంటసీగా రూపొందిన చిత్రం 'త్రివిక్రమన్' . రవిబాబు, నాగబాబు, శ్రీ (ఈరోజుల్లో ఫేమ్), ధనరాజ్, ప్రవీణ్‌రెడ్డి, అమూల్యారెడ్డి, షాలిని ప్రధాన తారాగణం. అమీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు ట్రైలర్‌ను విడుదలచేయగా, మరో అతిథిగా పాల్గొన్న శేకూరి ధర్మశాస్త్ర పీఠాధిపతి గుంతపల్లి శ్రీనివాసరావు టైటిల్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత క్రాంతికుమార్ మాట్లాడుతూ, కొత్తదనానికి పట్టంకట్టే తెలుగుప్రేక్షకులు ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. చిత్ర నిర్మాణంలో తనకు సహాయ సహకారాలు అందించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పేరు పేరునా ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు.ఈ చిత్రంలో ఓ పాత్రను పోషించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, ఈ చిత్రం వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యేందుకు తనవంతు సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. అనంతరం అతిథుల చేతులమీదుగా చిత్రబృందానికి జ్ఞాపికల ప్రదానం జరిగింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







