భారత్, వియత్నాం మధ్య 12 కీలక ఒప్పందాలు
- September 02, 2016
భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం అర్థరాత్రి వియత్నాం చేరుకున్న ప్రధాని మోదీకి వియత్నాం నేతలు ఘనస్వాగతం పలికారు. స్థానిక ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో భద్రతా దళాల నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వియత్నాం అమరవీరులకు మోదీ నివాళులర్పించారు. హోచిమిన్ నివసించిన ఇంటిని మోదీ సందర్శించారు.
వియత్నాం పర్యటన సందర్భంగా హనోయ్‌లో ఆదేశ ప్రధానితో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో భారత్-వియత్నాం మధ్య 12 ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు.
అనంతరం ప్రధాని మోదీ, వియత్నాం ప్రధాని సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. మోదీ మాట్లాడుతూ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని పేర్కొన్నారు.
వియత్నాంతో ఒప్పందం వల్ల ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందన్నారు. వియత్నాం బలమైన ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా వియత్నాం ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వియత్నాం ప్రజలు చూపిన అభిమానం మనసును ఆకట్టుకుందని పేర్కొన్నారు
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







