మొబైల్‌ షాపుల లోకలైజేషన్‌ తొలిదశ పూర్తి

- September 03, 2016 , by Maagulf
మొబైల్‌ షాపుల లోకలైజేషన్‌ తొలిదశ పూర్తి

శుక్రవారంతో తొలి దశ మొబైల్‌ షాపుల లోకలైజేషన్‌ పూర్తయ్యింది. శుక్రవారం నుంచి రెండో దశ ప్రారంభమయ్యింది. తొలి దశలో 50 శాతం మొబైల్‌ షాపులు పూర్తిగా సౌదీకి చెందినవారిలోనే ఉంచేలా చర్యలు తీసుకున్నారు. దాంతో చాలావరకు దుకాణాలు మూతబడ్డాయి. వలసదారులు నిర్వహిస్తున్న దుకాణాలు మూతబడ్డంతో సౌదీ పౌరులు నిర్వహిస్తున్న దుకాణాలు కళకళ్ళాడుతున్నాయి. రెండో దశలో పూర్తిగా 100 శాతం మొబైల్‌ దుకాణాలు సౌదీ పౌరుల చేతుల్లోకి వెళ్ళనున్నాయి. సౌదీ లోకలైజేషన్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిర్ణయం ద్వారా సౌదీ నుంచి ఇతర దేశాలకు తరలి వెళ్ళే డబ్బు, సౌదీ అవసరాల కోసమే ఉపయోగపడ్తుందని అధికారులు అంటున్నారు. అయితే శుక్రవారం నాటి పరిస్థితుల్ని అంచనా వేసినప్పుడు, శుక్రవారం సెలవు దినం కావడంతో చాలా దుకాణాలు మూతపడి ఉన్నాయి. దాంతో, పూర్తి వివరాలు తెలియడానికి కొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ స్థానిక దుకాణదారులు చెబుతున్నదాన్ని బట్టి సౌదీ లోకలైజేషన్‌కి మంచి స్పందన వచ్చినట్లు తెలియవస్తోంది. సౌదీలో మొబైల్‌ ఫోన్‌ దుకాణాల వ్యాపారం అత్యంత లాభసాటిగా ఉంది. దాంతో ఈ రంగంలో ఇతర దేశాలకు చెందినవారి ఆధిపత్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సౌదీ లోకలైజేషన్‌కి మొబైల్‌ దుకాణాల్ని ఎంపిక చేసింది. ఈ ప్రయోగం సత్ఫలితాలనిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com