పసిపిల్లల ప్రాణదాత అల్ మహా చిల్డ్రన్ యూనిట్
- September 03, 2016
రుమైలా హాస్పిటల్‌లోని అల్ మహా చిల్డ్రన్ యూనిట్, చిన్న పిల్లలు వారి తల్లి దండ్రులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటోంది. ఎందరో చిన్నారులకు ప్రాణదాతగా నిలుస్తోంది. కొన్ని తీవ్రమైన అనారోగ్యాల విషయంలో ఎక్కువకాలం ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది చిన్న పిల్లలకు. సాధారణంగా ఇది తల్లిదండ్రులకు తీవ్రమైన మానసిక వేదనను కలిగిస్తుంది. అయితే అల్ మహా చిల్డ్రన్ యూనిట్‌లో తల్లిదండ్రులు అందించే ప్రేమతోపాటు, అన్ని సౌకర్యాలతో కూడిన అత్యాధునిక వైద్యాన్ని అందుబాటులో ఉంచుతారు. 3 నెలల నుంచి 14 ఏళ్ళలోపు చిన్నారులకు అవసరమైన అన్ని చికిత్సలూ ఇక్కడ సుదీర్ఘకాలం పాటు అందించగలుగుతున్నారు. 33 వారాలకే జన్మించిన అమిరా అనే ఓ అమ్మాయి (నిజమైన పేరు కాదు), 3 నెలల వయసులో ఈ ఆసుపత్రిలో చేరింది. 4 ఏళ్ళు వచ్చేవరకు ఆమె అక్కడ మెకానికల్‌గా అందించే వెంటిలేటర్ సాయంతో ప్రాణం నిలుపుకుంది. ఆమెకు మెరుగైన వైద్యం దక్కడంతో నాలుగేళ్ళ తర్వాత ఆమె పూర్తి ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంది. 2010 అక్టోబర్‌లో ఈ యూనిట్ ప్రారంభమయ్యింది. నెలలో ఓ సారి పిడియాట్రీషియన్, ఫార్మసిస్ట్, న్యూట్రిషనిజ్ట్, రెస్పిరేటరీ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, నర్స్ మరియు ఆక్యుపేషనల్ థెరపిస్ట్, వీరితోపాటు పిడియాట్రిక్ పల్మనాలజీ కన్సల్టెంట్లు, స్పెషలిస్టులు అలాగే మమాద్ మెడికల్ కార్పొరేషన్ నెట్‌వర్క్ ఆసుపత్రుల నుంచి నిపుణులు వచ్చి అల్ మహా టీమ్‌తోపాటు ఆసుపత్రిలో రౌండ్స్ నిర్వహిస్తారు. పేషెంట్‌కి అవసరమైన వైద్య చికిత్స అందించడంలో వీరు తగిన సూచనలు చేస్తారు. తద్వారా చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో అల్ మహా చిల్డ్రన్ యూనిట్ ఎందరో చిన్న పిల్లలకు ప్రాణదాతగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







