దుబాయ్ నుంచి హజ్‌కి తొలి అదనపు ఫ్లైట్
- September 03, 2016
దుబాయ్ నుంచి సౌదీ అరేబియాకి తొలి అదనపు విమానం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1 నుంచి 400 మంది ప్రయాణీకులతో బయల్దేరింది. మొత్తం 12 అదనపు విమానాల్ని దుబాయ్ నుంచి సౌదీ అరేబియాకి హజ్ యాత్రీకుల కోసం ఈ హజ్ సీజన్‌లో ఏర్పాటు చేశారు. హజ్‌కి వెళ్ళే ముందు దుబాయ్‌లో ఒకరోజు ఆగేవారి ప్రయాణీకుల సంఖ్య 16,000 వరకు ఉంటుందని దుబాయ్ ఎయిర్ పోర్ట్స్ హజ్ కమిటీ హెడ్ మొహమ్మద్ అల్ మర్జోకి చెప్పారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హజ్ యాత్రీకుల కోసం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందిస్తున్నామని అధికారులు తెలిపారు. టెర్మినల్ వన్‌లో ఎనిమిది డెడికేటెడ్ కౌంటర్స్‌ని ఏర్పాటు చేశారు. నాలుగు కౌంటర్లను రెండో టెర్మినల్‌లోనూ, మూడో టెర్మినల్‌లో 14 కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2500 మంది ఎమిరేటీలు, అలాగే దుబాయ్‌లో నివసిస్తున్న వలసదారులు ఈ ఏడాది హజ్ నిర్వహిస్తారని అంచనా వేస్తున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులు డ్రాపింగ్, పికప్ కోసం వచ్చేవారికి ఉచితంగా పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది హజ్ సందర్భంగా. అలాగే ఆరోగ్యపరమైన చెకప్స్ కోసం కూడా తగిన ఏర్పాట్లను చేశారు.
తాజా వార్తలు
- ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!







