హరీష్, అవంతిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వైశాఖం'
- September 04, 2016
జయ.బి దర్శకత్వంలో హరీష్, అవంతిక జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'వైశాఖం'. సాయికుమార్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. బి.ఎ.రాజు నిర్మాత. చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకరుల సమావేశం నిర్వహించారు. దర్శకురాలు జయ మాట్లాడుతూ.. 'సినిమా పేరు వినగానే చాలామంది ప్రత్యేకమైన అనుభూతికి గురువుతున్నారు. సినిమా కూడా అలాంటి భావనే కలిగిస్తుంది. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యముంది' అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. 'వైశాఖం'లో ప్రేమ, వినోదంతో పాటు ఓ మంచి సందేశం ఉందన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు వసంత్, ఛాయాగ్రాహకుడు వాలిశెట్టి సుబ్బారావు, నటులు కాశీ విశ్వనాథ్, భద్రమ్, సుదర్శన్, శివ, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







