విజయ్‌ దర్శకత్వంలో సాయేషా సైగల్‌

- September 05, 2016 , by Maagulf
విజయ్‌ దర్శకత్వంలో సాయేషా సైగల్‌

'అఖిల్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సాయేషా సైగల్‌ తమిళ చిత్ర పరిశ్రమలోకి తేరంగేట్రం చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో జయం రవి హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో సాయేషా కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఇవాళ లాంఛనంగా ప్రారంభించినట్లు జయం రవి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని సాయేషా ట్వీట్‌ చేశారు. దీంతోపాటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జయం రవితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. హరీశ్‌ జయరాజ్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగణ్‌ సరసన సాయేషా నటించిన 'శివాయ్‌' చిత్రం అక్టోబరు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com