60 ఏళ్ళు పైబడ్డ వలసదారులకు ఎలక్ట్రానిక్ వర్క్ పర్మిట్స్
- September 06, 2016
సెప్టెంబర్ 19 నుంచి 60 ఏళ్ళు పైబడ్డ సీనియర్ వలసదారులు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో వర్క్ పర్మిట్స్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ వెబ్ సైట్లో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో ఇఎంఎస్ (ఎక్స్పాట్రియేట్ మేనేజ్మెంట్ సిస్టమ్) ద్వారా వారి అప్లికేషన్లు తీసుకోబడ్తాయని, అధికారికవ ర్గాలు వెల్లడించాయి. ఇన్వెస్టర్స్ వర్క్ పర్మిట్స్ కూడా ఈ విధానంలోనే మంజూరు చేయబడ్తాయి. సెప్టెంబర్ 19 లోపు మాత్రం మాన్యువల్‌గానే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. అప్లికేషన్ అప్రూవ్ చేయబడినా లేదంటే తిరస్కరించబడినా, సంబంధిత వ్యక్తికి ఇ-మెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. 'న్యూ వర్క్ పర్మిట్ లేదా రెన్యువల్ ఫర్ ఓవర్ 60' ఒరిజినల్ అప్లికేషన్‌తోపాటు, అప్లికెంట్‌కి సంబంధించిన ఐడీ కార్డ్, ఎంప్లాయీ పాస్‌పోర్ట్, ఎంప్లాయీ ఐడీ కార్డ్, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ వంటివి అవసరమవుతాయి. స్పెషలైజ్డ్ ఆక్యుపేషన్ కోసం క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు కూడా అవసరం. డాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లు, ఇన్స్యూరెన్స్ మరియు బ్యాంకింగ్ సెక్టార్‌కి చెందిన వారైతే సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ అప్రూవల్ పొందాలి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







