ఢిల్లీకి వెళ్లనంటున్న బాబు
- September 07, 2016
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రానని తేల్చి చెప్పారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్‌లకు బాబు ఫోన్ ద్వారా తెలిపారు. ఇదే విషయాన్ని వారు అరుణ్ జైట్లీకి చెప్పారు. దీంతో వారు చంద్రబాబు లేకుండానే ఫ్యాకేజీపై ప్రకటన చేసే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం అరుణ్ జైట్లీ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అంతకుముందు బుధవారం ఉదయం నుంచి ఏపీకి ప్రత్యేక సాయంపై కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రత్యేక చర్చలు జరిపారు. హోదా కన్నా మంచి ప్యాకేజీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అదే విషయాన్ని వెంకయ్యనాయుడు చంద్రబాబుకు ఫోన్ ద్వారా వెల్లడించారు.
అందులో కొన్ని అంశాలపై సూచనలు కూడా చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







