'ఎయిర్ చైనా' సంస్థ జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు..
- September 07, 2016
చైనా విమానాయాన సంస్థ 'ఎయిర్ చైనా' జాతివివక్షపూరితమైన వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా లండన్ సురక్షిత నగరమని, కానీ, అక్కడ భారతీయులు, పాకిస్తానీలు, నల్లజాతీయులు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని తన ప్రయాణికులను హెచ్చరించింది. భారతీయులను కించపరిచేలా తన మ్యాగజీన్ లో ఎయిర్ చైనా చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలను ఆ దేశానికి చెందిన ఓ జర్నలిస్టు వెలుగులోకి తెచ్చారు.
'ఎయిర్ చైనా' మ్యాగజీన్ లో జారీచేసిన హెచ్చరికను చైనీస్ జర్నలిస్టు అయిన హేజ్ ఫ్యాన్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆ మ్యాగజీన్ స్క్రీన్ షాట్ ను పోస్టుచేసిన ఆమె.. ఈ ట్వీట్ కు లండన్ మేయర్ సాధిక్ ఖాన్ ను ట్యాగ్ చేశారు.'పాకిస్థాన్ దంపతులకు జన్మించిన మేయర్ సాధిక్ ఖాన్ లండన్ నగరం అందరినీ ఆహ్వానిస్తుందని ప్రచారం చేస్తున్నారు. భారతీయులు-పాకిస్థానీలు అధికంగా నివసించే దక్షిణ లండన్ లోని సందర్శనీయ ప్రాంతాల గురించి ఆయన తన బ్లాగ్ ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆయన ప్రచారాన్ని నీరుగార్చేలా ఎయిర్ చైనా సలహా జారీ చేసింది' అని ఆమె సీఎన్ఎన్ మీడియాతో పేర్కొన్నారు. గతంలోనూ చైనాలో జాతివివక్షను చూపేలా డిటర్జంట్ ప్రకటనను ప్రసారం చేసిన సంగతిని ఆమె గుర్తు చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









