మెగా అభిమానులకి గుడ్ న్యూస్.
- September 07, 2016
మెగా అభిమానులకి గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెం.150' రిలీజ్ డేట్ ఫిక్సయింది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఖైదీని ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయం తెలిసిందే. తాజాగా, దర్శకుడు వినాయక్ ఖైదీ రిలీజ్ డేట్ ని వెల్లడించారు. భోగి రోజున ఖైదీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించారు. దీంతో.. మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలావుండగా.. మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఇస్తోన్న చిత్రం "ఖైదీ నెం. 150". తమిళ్ 'కత్తి'కి రిమేక్ ఇది. వివి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ జతకట్టనుంది.సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







