మెడికల్ వీసాల్లో 222 శాతం పెరుగుదల
- September 07, 2016
మస్కట్: ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీ 222 శాతం వృద్ధితో రికార్డు స్థాయిలో మెడికల్ వీసాల్ని ఆగస్ట్ చివరి నాటికి మంజూరు చేసింది. గత ఏడాదితో పోల్చితే ఈ శాతం చాలా ఎక్కువని ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 14,585 మెడికల్ వీసాల్ని ఈ ఏడాది ఆగస్ట్ చివరి నాటికి మంజూరయ్యాయి. గత ఏడాది వీటి సంఖ్య 4,530 మాత్రమే. 14,585 వీసాల్ని పొందినవారిలో 95 శాతం ఒమనీయులే. భారతదేశానికి మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం వీరంతా వెళ్ళారు. మిగతావారిలో యెమనీలు, బంగ్లాదేశీ మరియు ఇండోనేసియన్లు ఉన్నారు. భారతదేశంలో లభిస్తున్న వైద్య సేవలు అత్యంత నాణ్యంగా, అతి తక్కువ ఖర్చుతో ఉంటుండడంతోనే భారతదేశానికి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నట్లు సుల్తానేట్‌లో భారత రాయబారిగా పనిచేస్తున్న ఇంద్రా మణి పాండే తెలిపారు. ఆంకాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూరాలజీ వంటి స్పెషాలిటీ వైద్య సేవలు ఇండియాలో అత్యద్భుతంగా అందుబాటులో ఉన్నాయని ఒమన్‌లోని లైఫ్ లైన్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ రోహిల్ రాఘవన్ చెప్పారు. గతంలో యూరోప్‌కి వెళ్ళేందుకు ఆసక్తి చూపేవారంతా ఇప్పుడు వైద్యం కోసం భారతదేశానికి వెళుతున్నట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







