రెండు సాక్షరభారత్ అవార్డులను కైవశం చేసుకున్న తెలంగాణా
- September 08, 2016
దేశ రాజధాని దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన గ్రామాలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సాక్షరభారత్ అవార్డులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రెండు సాక్షరభారత్ అవార్డులు సాధించింది. ఎంపీ వినోద్ దత్తత గ్రామం వీరన్నపల్లి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి దత్తత గ్రామం బకారం అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ రెండు గ్రామాల సర్పంచులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 15-50ఏళ్ల మధ్య వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సాక్షరభారత్ పతకాన్ని ప్రవేశపెట్టింది.ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధిలో వీరన్నపల్లి 11వ స్థానంలో నిలవడం విశేషం.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







