నితిన్ సినిమా మొదలయిందోచ్
- September 08, 2016
యూత్‌స్టార్ నితిన్ హీరో వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాథ' వంటి సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ప్రొడక్షన్ నెం.9గా నిర్మిస్తున్న కొత్త చిత్రం సెప్టెంబర్ 8న సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'అఆ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యూత్‌స్టార్ నితిన్ చేస్తున్న మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి ప్రముఖ నిర్మాత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, ప్రముఖ నిర్మాత, హీరో నితిన్ తండ్రి ఎన్.సుధాకర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో నితిన్, చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ని దర్శకుడు హను రాఘవపూడికి అందించారు. నవంబర్ ద్వితీయార్థంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని సమ్మర్ ప్రారంభంలో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







