''డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం"..
- September 08, 2016
కథానాయిక సమంతతో నాగచైతన్య, ఫ్యాషన్ డిజైనర్ శ్రీయా భూపాల్‌తో అఖిల్ ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. తనయుల పెళ్లి గురించి గురువారం నాగార్జునను ప్రశ్నించగా - ''డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం జరుగుతుంది. 'సమంతతో ప్రేమలో ఉన్నాను. త్వరలో పెళ్లి చేసుకుంటాను' అని చైతూ చెప్పాడు.కానీ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పలేదు.బహుశా.. వచ్చే ఏడాది ఉండొచ్చు.అఖిల్ స్పష్టంగా చెప్పడంతో నిశ్చితార్థం ఫిక్స్ చేశాం. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమా పూర్తయ్యాక వచ్చే ఏడాది పెళ్లి'' అని నాగ్ అన్నారు. త్వరలో ఎంగేజ్మెంట్ పనులు ప్రారంభిస్తారా? అని అడిగితే, ''అఖిల్ నిశ్చితార్థం ఏర్పాట్లు అమ్మాయి తరఫు వాళ్లే చూసుకుంటున్నారు.పెళ్లి బాధ్యలైతే చైతూ, అఖిల్‌కే వదిలేశా. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఇద్దరి సినిమాలపై నేను దృష్టి పెట్టాను'' అన్నారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







