సెన్సార్ పూర్తి చేసుకున్న 'శ్రీమంతుడు'
- August 04, 2015
సూపర్ స్టార్ శ్రీమంతుడు 'సెన్సార్' కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారులు ఎలాంటి కట్స్ లేకుండా ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారట. అలాగే ఈ చిత్ర నిర్మాతలను కూడా పొగడ్తలతో ముంచెత్తారట. ''చాలా రోజుల తర్వాత తెలుగులో మంచి విలువలు వున్న సినిమా చూశా౦. మానవతా విలువలతో పాటు అన్ని రకాల ఎమోషన్స్ వున్న సినిమా చూసి చాలా కాలమైందని'' నిర్మాతలను మెచ్చుకున్నారట. ఊరిని దత్తత తీసుకునే కథాంశంతో వస్తున్న ఈ సినిమలో కుటుంబ బంధాల గురించి.. మానవతా విలువల గురించి వర్ణిస్తూ.. గ్రామాల ప్రాధాన్యతను కూడా తెలియచేసేలా అద్భుతంగా వచ్చిందట. బేసికల్ గా మన సూపర్ స్టార్ కి ఓవర్సీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అయితే ఈ సినిమాలో విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డ ఎన్నారైలకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని చెబుతున్నారు. తెలుగులో ప్రమోషన్లతో దూసుకుపోతున్న 'శ్రీమంతుడు', నేటి నుంచి తమిళంలో ప్రచార కార్యక్రమాలకు తెరలేపనున్నాడు. మహేష్ స్వయంగా ఈ సాయంత్రం చెన్నైలో జరిగే ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నాడు. ఈ సందర్భంగా 'సెల్వందన్' ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ శృతి హాసన్,దర్శకుడు కొరటాల శివ తదితరులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







