బేబీ కార్న్‌ ఫింగర్‌ చిప్స్‌

- August 04, 2015 , by Maagulf
బేబీ కార్న్‌ ఫింగర్‌ చిప్స్‌

బేబీ కార్న్‌ ఫింగర్‌ చిప్స్‌
బేబీకార్న్‌ - పది
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌
పచ్చిమిర్చి ముద్ద - ఒక టీస్పూన్‌
మిరియాల పొడి - అర టీస్పూన్‌
ఆవపొడి - అర టీ స్పూన్‌
గుడ్డు - ఒకటి
బ్రెడ్‌ పొడి - అరకప్పు
సోయాసాస్‌ - అర టీ స్పూన్‌
ఉప్పు - తగినంత
నూనె - సరిపడినంత
తయారీ విధానం
ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్టు, మిరియాలపొడి, ఆవపొడి, సోయాసాస్‌ ఉప్పు వేసి బాగా కలపాలి. తరువాత అందులోనే బేబీకార్న్‌ కూడా వేసి ఆ మిశ్రమం వాటికి బాగా పట్టేలా చేసి అరగంటసేపు నాననివ్వాలి. తరువాత వీటిని గిలక్కొట్టిన గుడ్డుసొనలో ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించాలి. ఇప్పుడు కాగిన నూనెలో వేయిస్తే బేబీకార్న్‌ ఫింగర్‌ చిప్స్‌ రెడీ.



 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com