కార్న్‌మీల్ ఇడ్లీ
- September 09, 2016
కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి, పుల్లటి పెరుగు - ఒక్కోటి రెండు కప్పులు, క్యారెట్ (తురుము) - ఒకటి, కొత్తిమీర (తరుగు)- గుప్పెడు, కరివేపాకు (సన్నగా తరిగి) - ఒక రెమ్మ, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశెనగపప్పు - ఒక్కో టీస్పూన్, బేకింగ్‌సోడా - చిటికెడు.
తయారీ విధానం: తాలింపు గిన్నెలో నూనె వేసి అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పులు వేసి వేగించాలి. ఇందులోనే మొక్కజొన్న పిండి కలిపి కొన్ని నిమిషాలు వేగించాలి. (టైంలేకపోతే మొక్కజొన్న పిండి వేగించకుండా వాడుకోవచ్చు.) స్టవ్ ఆపేసి క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి పావుగంట పక్కన పెట్టాలి. ఆ తరువాత నీళ్లు పోసి బేకింగ్ సోడా వేసి ఇడ్లీ పిండిలా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి. కొబ్బరి లేదా పుదీనా చట్నీలతో వీటిని తినాలి.
తాజా వార్తలు
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!
- ఖతార్ జాతీయ దినోత్సవం.. షురా కౌన్సిల్ చైర్మన్ అభినందనలు..!!
- హైదరాబాద్: మూడు కమిషనరేట్ల పోలీసుల సంయుక్త వ్యూహం







