అనారోగ్య సమస్యలకు ప్రధానంగా ఒబిసిటీని కారణo

- September 09, 2016 , by Maagulf
అనారోగ్య సమస్యలకు ప్రధానంగా ఒబిసిటీని కారణo

కూల్‌డ్రింక్స్‌తో ఆరోగ్యానికి ముప్పు తప్పదంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.. అలాగే జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళనే వద్దంటున్నారు. అనారోగ్య సమస్యలకు ప్రధానంగా ఒబిసిటీని కారణమవుతుంది. శారీరక శ్రమ లేకపోవడంతో పాటు గంటల తరబడి కంప్యూటర్లకే అతుక్కుపోవడం ద్వారా శరీరానికి తగిన వ్యాయామం లభించట్లేదు. దీనికి తోడు ఆరోగ్యానికి అవసరమైన ఆహారం తీసుకోకుండా జంక్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్ వంటివి తీసుకోవడం ద్వారా గుండెపోటు వంటి వ్యాధులకు అనేకమంది  గురవుతున్నట్లు సర్వేలు తేల్చాయి. 

 
అందుకే కూల్‌డ్రింక్స్‌కు బదులు మంచినీరు ఎక్కువ తీసుకోవాలి. చక్కెర శాతం ఉన్న నానారకాలైన పానీయాల కంటే నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు, టీవీ చూస్తూనో, కంప్యూటర్‌ ముందు కూర్చునో చిప్స్‌ వంటి స్నాక్స్‌ తినడం కన్నా ఇంట్లో రక రకాల పండ్లను నిలువ పెట్టుకుని, జంక్‌ఫుడ్‌ బదులు పండ్లు తినడం అలవాటు చేసుకోవాలి.
 
ఉదయం పూట తప్పకుండా అల్పాహారం తీసుకోవాలి. తీసుకునే అల్పాహారంలో విటమిన్స్, ఫైబర్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యమివ్వండి. జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు. తద్వారా బరువు తగ్గించుకోవడం సులభం అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం అంటే... పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా.. తృణధాన్యాలు, ఆకుకూరలు, జామ, ఉసిరి, నేరేడు పండ్లు డైట్‌లో చేర్చుకోండి. 
 
జంక్‌ఫుడ్‌ తీసుకునే టీనేజర్లు, జంక్‌ఫుడ్‌ తీసుకోని వారికంటే అధిక బరువు పెరగడం, చురుకుదనం కోల్పోవడం వంటి జరుగుతాయి. జంక్ ఫుడ్స్ ద్వారా శరీరానికి కావలసిన కాల్షియం, ఐరన్‌ వంటి పోషక పదార్థాలు దూరమవుతాయి. సో.. జంక్ ఫుడ్స్.. కూల్ డ్రింక్స్ జోలికి మాత్రం వెళ్ళొద్దు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com