'వానవిల్లు' చిత్రం ట్రైలర్‌ విడుదల

- September 09, 2016 , by Maagulf
'వానవిల్లు' చిత్రం ట్రైలర్‌ విడుదల

ప్రతీక్‌ ప్రేమ్‌ కరణ్‌ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'వానవిల్లు' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతీక్‌ మాట్లాడుతూ.. 'నాకు సినిమా అంటే చాలా ఇష్టం. కొన్ని లఘు చిత్రాలకు దర్శకత్వం వహించా. నా ఆసక్తి చూసి మా నాన్న నన్ను ప్రోత్సహించారు. అంతేకాదు నాపై నమ్మకంతో చిత్రాన్ని నిర్మించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సినిమా ఉంటుంది' అన్నారు.
శ్రావ్య ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. లంకా ప్రభు ప్రవీణ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. విశాఖ, హేమ, ప్రభాస్‌ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్దస్త్‌ ఫణి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com