ఫిదా రెండో షెడ్యూల్ అమెరికాలో..
- September 09, 2016
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఫిదా' . సాయిపల్లవి కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకుడు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కాగా కొద్దిరోజులుగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో జరుగుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేసుకుని యూనిట్ తిరిగి హైదరాబాద్ చేరుకుంది. ఇందులో భాగంగా ప్రధాన పాత్రలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.ఈ విషయాన్ని వరుణ్ ట్వీట్ చేయడంతో పాటు కథానాయిక సాయిపల్లవి, శేఖర్ కమ్ములతో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం రెండో షెడ్యూల్ మొదలు కానున్నట్లు, దానిని కథాపరంగా అమెరికాలో చిత్రీకరిస్తారని, అందుకు అనుగుణంగానే చిత్రబృందం అమెరికా ప్రయాణానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. అమెరికా అబ్బాయికి..తెలంగాణ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథతో ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







